ఇంకా hollidays ఒక వారం ఉన్నాయి అంతే .ఆ రోజు సాయంత్రం park లో కలిసారు అంతా . Sudha కి abhi మీద ఇంకా కోపం తగ్గలేదు . Jay వాళ్ళ నానమ్మ కి వంట్లో బాగోలేదని phone వస్తుంది అవాల . అదే మాట్లడుకున్తుంటారు అంతా . Abhi అంటాడు ఇక్కడికి తీసుకొచ్చి మీ college లో చూపించాచు కదా మీకు తెల్సిన doctor కి అంటాడు . మాకు అంతగా ఎవరు తెలీదు 2nd year లో కదా hospital postings ఉంటాయి vikram ని అడగాలి అంటాడు jay. ఐనా మన sudha వాళ్ళ బావ ఉన్నాడు కదా russia లో చదివి వచ్చిన పెద్ద doctor అతన్ని అడగకపోయావ ఒక మాట అంటాడు abhi sudha ని నవ్వించాలని . ఏమి వెటకారం చేయక్కర్లేదు మా బావ ని నీ కంటే character లో వేయి పాళ్ళు నయం మా బావ అంటుంది కోపంగా .
అబ్బా మరి అలా అయితే మీ బావ ఎవరికో propose చేస్తే చెంప పగలకొట్టిందట అని చెప్పావ్ ఆ మద్య ..అదేంటమ్మ …..అంటాడు abhi. ఆ తర్వాతే ఆ అమ్మాయి వచ్చి I love you చెప్పింది మా బావ కి అంతే కాని తనేమి ఆ అమ్మాయిని బతిమిలాడలేదు అంటుంది sudha. ఐనా ఆ పిల్ల కూడా వదిలేసి పోయినా నేనున్నా మా బావ కి నీకేవరున్నారో చూసుకో నువ్వెవరికీ propose చేసిన ఎవరు ఒప్పుకోరు అంటుంది ఆవేశంగా . ఆ మాటలకి చాల బాధ పడతాడు abhi. నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోతాడు .Sudha కూడా వెళ్ళిపోతుంది . Jay meena కి ఎం చేయాలో అర్ధం కాదు వాళ్ళ విషయం లో .
మర్నాడు abhi jay వాళ్ళ ఇంటికేల్తాడు …..నీకొకటి చెప్పాలి అంటదు jay తో .
ఏంటి రా నిన్న sudha అన్న మాటలకు ఇంకా బాధ పడుతున్నావా అంటాడు jay. బాధ కాదు రా అది ఈ మద్య ఎందుకు నా మీద అలా కోపంగా ఉంటుందో అర్ధం కావట్లేదు . వాళ్ళ బావ కి తనున్నాను అని చెప్పింది నేను జీర్నిన్చుకోలేకపోతున్నాను రా …నాకు తానంటే చాలా ఇష్టం …. తను నా జీవితం లో ఎపుడు నాతోనే ఉండాలి రా అంటాడు abhi. ఎంటిరా నువ్వనేది ..అంటే నువ్వు sudha ని ……అంటదు jay. అవును రా నాకు తానంటే చిన్నప్పటి నుండి ఇష్టం చదువయిపోయాక చెప్దామనుకున్నా ….కాని ఇపుడీ పరిస్థితి చూస్తుంటే విషయం చెప్పేసి అపార్ధాలు దూరం చేయాలనుంది . Vikram meena ని చూస్తుంటే నాకు అలా sudha తో ఉండాలనిపిస్తుంది రా …కాని sudha లేదు కాదు మనం just friends అంతే అంటుందేమో అని భయమేస్తుంది అంటాడు abhi.
Jay ” నీ మొహం …దానికి కూడా నువ్వంటే చాల ఇష్టం రా …..అసలు అదే నీకు propose చేద్దామని నీకోసం gift card అన్నీ కొన్నది అంటాడు . నువ్వు చెప్పేది నిజమా అంటాడు ఎంతో సంతోషంగా abhi. నాకు meena కి ఎపుడో తెలుసు ఈ విషయం కాని నీకు చెప్పొద్దూ అంది sudha అంటాడు . Thanks రా చాలా happy గా ఉంది నాకు ఈ విషయం విని …గుండెల్లో భారమంతా దిగిపోయింది . నువ్వూ sudha కి చెప్పకు ఈ విషయం 3 days లో నా birthday ఉంది కదా ఆవాల చెప్పి నా birthday gift గా తన love ని ఇమ్మంటా అంటాడు గంతులేస్తూ . Good luck రా అంటాడు jay.
Abhi కి చాల ఆనందంగా ఉంటుంది …..తన bithday ముందు రోజు అందరికీ రేపు alankritha resorts కి వెళ్దాం నా birthday party ఇస్తాను అంటాడు .