SuDHA RAAGAM-Mini serial Episode 5

కాసేపు  మాట్లాడి  వెళ్ళిపోతాడు  vikram. Sravya చెప్పడం  మొదలు  పెడుతుంది .
“మేము  resorts కి  వెళ్ళాం  కదా  అక్కడ  సాయంత్రం  abhi నా  దగ్గరకొచ్చాడు  …… నేనొక్కదాన్నే  ఉన్నపుడు ….మామూలుగా  మాట్లాడాడు  కాసేపు  ..తర్వాత  ఒక్క   సరిగా  నా  చేయి  పట్టుకుని  I LOVE YOU sravya ……..నిన్ను  first చూసినప్పుడే   నాకు  నచ్హవు …నీ  మాటలు  నవ్వు  అన్నీ  నాకిష్టం  ..నేను  నీకు  నచ్చేసాను    కదా ..నాకు  అర్దమవ్తుంది  అన్నాడు .
Sudha కి  తెలీకుండానే  కళ్ళ వెంట  నీళ్ళు  రాలుతున్నాయి ….తల  తిరుగుతున్నట్టుగా  అనిపిస్తుంది . Sravya చెప్తూ  ఉంటుంది  “కాని  నేనోప్పుకోలేదు  నాకు  నీ  పైన  ఆలాంటి ఉద్దేశ్యం  లేదు  అని  చెప్పాను…… ఐనా  నన్నర్ధం  చేస్కో  sravya నాకేం  తక్కువ  అంటూ  బతిమిలాడాడు .
కాని  నేను  అసలు  ఒప్పుకోలేదు .
ఇంకా  నువ్ ఒప్పుకోకపోతే  నాకు  నీ  friendship కూడా  వద్దు  అంటూ  వెళ్ళిపోయాడు  “ అని  చెప్తుంది .
Sudha అక్కడి నుండి   లేచి  వెళ్ళిపోతుంది  lawn లో  bench పైన  కూర్చుని  విపరీతం  గా  ఏడుస్తుంది . Meena కూడా  sravya కి  byee చెప్పి  sudha దగ్గరికి వచ్చి  ఓదారుస్తుంది.

అలా  చాల  సేపు  ఏడుస్తూ  ఉంటుంది  sudha. Meena తనని  ఓదార్చి  తనే  drive చేస్కుంటూ  sudha ని  ఇంటికి  తీస్కేల్తుంది . Bike పిన  కూర్చుని  కూడా  ఏడుస్తూ  ఉంటుంది sudha. ఇంటికి  తీసుకెళ్ళకుండా  park కి  తీసుకొచ్చి  నచ్చ  చెప్తుంది  meena.
“అయిందేదో  అయింది  abhi ఇలా  చేస్తాడని  మనమనుకోలేదు  కాని  ఎందుకలా  చేశాడూ  మరి …ఐనా  ఆ  పిల్ల  ఒప్పుకోలేదు  గా  నువ్  చెప్పు  నీ  love విషయం …..నీకు  వాడంటే  ఇష్టమే  కదా .”..అంటుంది .
“లేదు  meena వాడు  నాకు chocolates తెచ్చి ఇచ్చినపుడు  ,నన్ను  ఎడిపించినపుడు  వాడి  కళ్ళలో  నా  మీద  ప్రేమ  కనిపించేది …వాడిలా  ఎందుకు  చేసాడు …నా  మనసు  నన్ను  మోసం  చేసింది ” అంటూ  ఏడుస్తుంది .
Sudha ని  సముదాయించి  వాళ్ళ  ఇంట్లో  వదిలిపెట్టి  వెళ్తుంది  meena.వాళ్ళ  అమ్మ  కి   కనపడకుండా  తన  room లో  కేల్లిపోతుంది  sudha….greeting card gift బయటికి  తీసి  వాటిని  చూసి  వెక్కి  వెక్కి  ఏడుస్తూ  అన్నం  కూడా  తినకుండా  నిద్ర  పోతుంది . వాళ్ళ  అమ్మ  నిద్ర  లేపడానికి  ప్రయత్నించి  లేవక  పోవడం  తో  light off చేసి  దుప్పటి  కప్పి  వెళ్ళిపోతుంది .

ఆదివారం  పొద్దున్న  చాల  ఆలస్యం  గా  లేస్తుంది  sudha. Gift greeting card లోపల  పెట్టి  అమ్మ  చూసిందా  ఏంటి  అని  కంగారు  పడుతుంది .
“నీరసం  గా  ఉన్నవెమ్మ  జ్వరం  వచిండా  “అంటుంది  వాళ్ళమ్మ .
“Doctor గారిని  జ్వరం  గురించి  అడుగుతావెంటీ  ఆమెకి  తెలవదా  వైద్యం ” అని  వినిపిస్తుంది  sudha కి  .
చూస్తె  వాళ్ళ  మేన మామ  వచ్చి  ఉంటారు .
“ఎపుడొచ్చావ్  మామయ్య  అంటుంది  “sudha.
“పొద్దున్న  train కి  వచ్చా  రా  ఎలా  ఉన్నావ్  college ఎలా  ఉంది  ….ఇదిగో  బావ  నీకేవో  books అవసరం అయితాయని  పంపించాడు  “అని  ఇస్తాడు .
“Russia నుండి  ఎపుడు వస్తాడు  మామయ్య  బావ ” అంటుంది  sudha.
“ఇంకొక  సంవత్సరం  ఉండతమ్మ  చదువు  వచ్చేస్తాడు  ఇంకా    “అంటాడు  వాళ్ళ  మామయ్య .

మామయ్య  రావడం  తో  కాస్త  తేలిక  పడుతుంది  sudha. స్నానం  చేసి  vikram వస్తానన్న  విషయం  గుర్తొచ్చి  park దగ్గరికి  వెళ్తుంది . అప్పటికే  jay abhi meena ఉంటారు  అక్కడ ……sudha వచ్చి  hii అని  calm గా  ఉంటుంది  ఎం  మాట్లాడకుండా ….
”ఏంటి  రా  అంత  dull గా  ఉన్నావ్  ఏమయింది ” అడుగుతాడు  abhi.
Abhi మొహం  కూడా  చూడలేకపోతుంది  sudha “ఏమి  లేదు  ‘ అని  మొహం  తిప్పెసుకుంటుంది .
“ఏడూ  ఉంటుంది  చెప్పు ” అంటాడు  abhi.
Meena నేను  abhi ని  అడుగుతా  అని  సైగ  చేస్తుంది  sudha కి . వద్దు  అని  కళ్ళతోనే  కోప్పడుతుంది  sudha.

అంతలో  ఒక  పాపా  greeting card gift పట్టుకుని  వీళ్ళ  వైపు  వస్తుంటుంది . ఆ  gift ఆ   packing sudha గుండె  వేగం  గా  కొట్టుకుంటుంది  …
“నేను  abhi కోసం  కొన్న  gift బయటికేలా  వచ్చింది …..ఈ  పాపా  ఇక్కడికెందుకు  తీస్కోస్తుంది …ఎవరి  పని  ఇది ….meena చేసి ఉంటుందా …..నాకు  చెప్పకుండా  ఎందుకిలా  చేస్తుంది ……అమ్మ  చూసి  ఇలా  చేసిందా …చా  చా  అమ్మ  ఎందుకిల  చేస్తుంది  …..ఇపుడిది  abhi చూస్తీ  ఎలా ….లేదు  నేను  abhi ని  ప్రేమించిన  విషయం  తనకి  తెలియకూడదు …ఎలా  ఎలా ” అని  ఆలోచిస్తూ  ఊపిరి  బిగబట్టి  ఆ   వచ్చే  పాపా  ని  చూస్తుంటుంది  …

1 Comment on "SuDHA RAAGAM-Mini serial Episode 5"

  1. chala bagundi…story baga narrate chestunnaru….next episode kosam wait chestunna…….

Comments are closed.