ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ మేన్ రె`ఢీ’

మహేష్ కు మరో దూకుడు

 కాజల్ తో కెమిస్ట్రీ పర్పెక్ట్

 విడుదలకు ముందే భారీ అంచనాలు

బిజినెస్ మేన్ పై ప్రివ్యూ 

ప్రిన్స్ మ‌హేష్‌బాబు హీరోగా, పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శక‌త్వంలో వెంక‌ట్ నిర్మాత‌గా తెర‌కెక్కుతున్న చిత్రం బిజినెస్‌మేన్‌.. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం మహేష్ కెరీర్‌లో మ‌రో బిగ్గెస్ట్ మూవీగా రికార్డులకెక్కుతుంద‌ని అప్పుడే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. మ‌హేష్ గ‌త చిత్రం దూకుడు సంచ‌ల‌న విజ‌యం సాధించడం, రికార్డుల క‌లెక్షన్స్‌తో టాలీవుడ్‌లో నెంబ‌ర్ టూ చిత్రంగా నిల‌వ‌డంతో బిజినెస్‌మేన్ చిత్రాన‌కి మ‌రంత క్రేజ్ తెచ్చిపెట్టింది. అంతేకాకుండా గ‌తంలో పోకిరి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ మూవీ తీసిన పూరి జ‌గ‌న్నాథ్ మ‌ళ్లీ అదేస్థాయి విజ‌యాన్ని అందుకోవాల‌నే క‌సితో ఈసినిమా తీసాడ‌ని ఇండ‌స్ట్రీ టాక్‌.. అంతేకాదు ఈ చిత్రంలో మ‌హేష్‌, కాజ‌ల్ కెమిస్ట్రీ కూడా అదిరిపోయింద‌ని, వీరిద్దరి మ‌ధ్య లిప్‌లాక్ ముద్దు సీన్లు కూడా హాట్ హాట్ గా ఉన్నాయ‌న్న కామెంట్స్‌, ట్రైల‌ర్స్‌లో మ‌హేష్ చెప్పే డైలాగ్స్ కూడా ఈ చిత్రానికి విప‌రీత‌మైన హైప్‌ని క్రియేట్ చేసాయి. ఇన్ని ప్రత్యేక‌త‌ల‌ని స‌త‌రించుకున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి పదమూడున ప్రపంచవ్యాప్తంగా రెండు వేల థియేటర్లతో భారీగా విడుద‌ల‌వుతోంది. ఈ మూవీ రివ్యూకోసం వేచి చూడండి.