Pages Menu
Categories Menu

Posted by on Jan 20, 2012 in Opinion

బడ్జెట్ పై ముందుగానే ఆసక్తి ?

మరోసారి బడ్జెట్ రాబోతుంది. ప్రస్తుతానికి బడ్జెట్ పూర్వసంప్రదింపులే జరుగుతున్నప్పటికీ, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే ఇప్పటి నుంచే సామాన్యుల్లో సైతం ఆసక్తి ఏర్పడుతోంది. నిజానికి  ఉగాది నాడు పంచాంగ శ్రవణంలా మారిపోయింది పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం.అయినప్పటికీ ఎప్పటికప్పుడు రాబోయే బడ్జెట్ పై ఎన్నో ఆశలు, మరెన్నో ఊహలు.
ప్రస్తుతానికి మనదేశం గడ్డు సవాళ్లనే ఎదుర్కుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో సంతృప్తికరమైన బడ్జెట్ ను అందించడం ఆర్థికమంత్రికి కష్టమే. ప్రస్తుత పరిస్థితే ఇలా ఉంటే, ఇక రాబోయే కాలం ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయమేస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో విత్త మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఏం చేయబోతున్నారు?
ఇప్పటికే రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నుంచి ప్రణబ్ కొన్ని సూచనలు స్వీకరించారు. దీంతో బడ్జెట్ పనికి శ్రీకారం చుట్టినట్టే అయింది.
స్వాతంత్ర్యానంతరం పదకొండు పంచవర్షప్రణాళికలు దొర్లిపోయాయి. ఇప్పుడు పన్నెండో పంచవర్ష ప్రణాళిక తొలి బడ్జెట్ ను రూపొందించే బాధ్యత ప్రణబ్ మీద పడింది.
ఇప్పుడు మనముందున్న సమస్యలు…
– ద్రవ్యోల్బణం…మరీ ముఖ్యంగా ఆహారద్రవ్యోల్బణం. ఇది మరింత పెరిగితే, సామాన్యుడి గతి అథోగతే అవుతుంది.
ఆటుపోట్లు ఎదుర్కుంటున్న ఆర్థిక రంగాన్ని  గాడిలో పెట్టాలి. సమ్మిళిత అభివృద్ధి సాధించాలి. ఈ కీలకాంశాలను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ రూపకల్పన జరగాలి.
ఈసారి రాష్ట్రాలు ఉపాధి కల్పన విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుచేశాయి. ఉద్యోగాలు కల్పించనటువంటి అభివృద్ధి మనదేశానికి అవసరం లేదనీ, అభివృద్ధి అన్నది ఉద్యోగావకాశాలను మెరుగు పరిచేదిగానే ఉండాలని రాష్ట్రాలు సూచించాయి.
నిజమే కదా… మన రాష్ట్రంలోని పరిస్థితే చూడండి. చాలా కాలం తర్వాత ఇప్పుడే ఉపాధి అవకాశాల మాట తరచూ వినబడుతోంది.ఇదేదో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గొప్పఅని చెప్పలేంకానీ, దాదాపు అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ యువతకు తక్షణమే ఉపాధి చూపకపోతే, యువశక్తి నిర్వీర్యమైపోతుందన్న భావన పేరుకుపోయింది. యథేచ్ఛగా  సెజ్ లు ఇచ్చేసి, సహజ వనరులను అప్పగించేసిన పాపానికి మన రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు కుంటుపడ్డాయి. దోపిడీదారుల చేతుల్లోకి బడా ప్రాజెక్టులు వెళ్ళిపోవడంతో నిరుద్యోగులు నోరెళ్లబెట్టుకుని చూడాల్సివచ్చింది. ప్రాజెక్టులు చేతిలోకి వచ్చేదాకా వేలాది మందికి ఉపాధి అవకాశాలు చూపిస్తామంటూ స్వర్గం చూపిన వారే ఆ తర్వాత కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా అప్పళంగా వచ్చిన భూములను స్వాధీనం చేసుకున్న సందర్భాలు అనేకం. ఈ సంస్కృతి చివరకు యువతను గుండాలుగా, రౌడీలుగా మార్చిందేతప్ప, వారిని సరైన బాటలో పెట్టలేకపోయింది. ఇప్పుడు చేతులుకాలాక ఆకులు పట్టుకున్నట్టుగా కిరణ్ కుమార్ రెడ్డి ఉపాధి అవకాశాల బోర్డు తగిలించుకుని బయలుదేరారు.
బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడీ కాదు. అది మనదేశ ఆరిక పరిస్థితికి వాస్తవ రూపం. అందుకే బడ్జెట్ వచ్చే ముందే అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించాల్సిందే. ప్రస్తుంత రాష్టాలు ఈ పనిలోనే ఉన్నాయి. ఇప్పటికే కేంద్రానికి తమ ఆలోచనలు ఏమిటో, విధానాలేమిటో ఎరుకపరిచాయి.
ఉపాధి కల్పన పెరగాలంటే, పెట్టుబడులను ప్రోత్సహించాలి. అందుకు తగ్గ వాతావరణం ఏర్పడాలి. అలాగే, పల్లెల్లో వ్యవసాయ ఉత్పాదిక పెరిగేలా చూడాలి. పట్టణాల్లో మౌలిక సౌకర్యాలు పెంచాలి. విద్య, ఆరోగ్య రంగాలపై మరింత శ్రద్ధపెట్టాలంటూ రాష్ట్రాలు ఘోషిస్తున్నాయి. మరి కేంద్ర సర్కార్ చెవికి సోకిందో లేదో…
కేంద్ర పథకాలు విశ్వనీయతను కోల్పోతున్నాయి. అవి చాలామటుకు చిల్లికుండలో నీరులా మారిపోయాయి. అవినీతి చీడ తొలగకపోవడంతో పథకాలకు కుమ్మరించే ధనం నిష్ప్రయోజనమైపోతోంది.. ఇంతటి విషాదకర పరిస్థితుల్లో మరోసారి బడ్జెట్ కసరత్తు మొదలైంది. మరి ఏలినవారు ఎలాంటి కరుణ చూపుతారో, మరెక్కడ వాతలు పెడతారో చూడాల్సిందే.