Pages Menu
Categories Menu

Posted by on May 17, 2011 in Satire, TG Roundup

సామి శిఖరం… ఇదీ ఎక్స్‌పెక్టేషన్ అంటే

ఠాగూర్ సినిమాలో చిరు అన్నయ్య విండొస్ మీడియా ప్లేయర్లో టైప్ చేస్తూ ఉంటాడు. అన్నయ్య అల్ట్+M కొడితే లంచగొండి అఫిసర్ల వివరాలు వస్తాయి. అలాంటి ఫీచర్ బహుశా అన్నే తయారుచేశాడా ఏంటి??!!

అతడే ఒక సైన్యం సినిమాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఏదో పిచ్చిగా టైప్ చేస్తూ కమాన్ కమాన్ అంటూ చివరకి ప్రకాష్‌రాజ్ స్విస్ బాంక్ అకౌంట్ ని హ్యాక్ చేస్తాడు. వర్డ్ తో అలా కూడా చెయ్యొచ్చా?

సూపర్ సినిమాలో ఆలిని టెస్ట్ చెయ్యడానికి బ్రహ్మానందం ల్యాప్‌టాప్ మీద షిఫ్ట్ కీ ని 3 సార్లు నొక్కేయ్యగానే లై డిటెక్టర్ ఆన్ అవుతుంది. షిఫ్ట్ తో స్టార్ట్ అయ్యే ప్రోగ్రాంస్ ఏమన్నా ఉన్నాయా జహాపనా?

చాలా సినిమాల్లో కంప్యూటర్లో ఏమన్నా వివరాలు కావాలంటే హీరోలు పది పదిహేను కీస్ నొక్కుతారు. కానీ ఆ పది పదిహేను కీస్ లో ఎంటర్ కానీ, అల్ట్ కానీ, కంట్రోల్ కానీ, ఏమీ ఉండవు. ఐనా వాళ్ళకి డీటేల్స్ వచ్చేస్తాయి.

ఇంకా వెంకీ అన్నయ్య ఐతే తురుంఖాన్. అన్న బుక్స్ చదివి రాత్రికి రాత్రి యూనిక్స్ సర్వర్ని బాగు చేస్తాడు. అంటే బుక్స్ ఉంటే చాలు, అనుభవం, సిస్టమ్ మీద అవగాహన అక్కర్లేదు. రైట్?

ఈ సొద ఎందుకంటే,  ఐటి లో ఉండేవాడు ఏదైన పొడిచేయ్యగలరు అని జనాల ఫీలింగ్.
బాంక్ లో నెట్‌వర్క్ డౌన్ ఐతే, మా మామ అడిగేవాడు. ఏరా, నువ్వు చూసి బాగుచెయ్యగలవా అని!!
ఆయనకి ఏమని చెప్పను… నేను పొడవగలిగింది మహా ఐతే ఒక చిన్న పిన్నీసు మొన అంత బొక్క అని 🙁

ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి. మా ఇంటిదగ్గర ఎవడో ఒక తలమాసిన వాడికి పదిహేను లక్షల జాబ్ వచ్చింది. వాడు ఎస్ఏపీ లో కింగంతటి వాడట. ఆది విని మా ఆవిడ అంటుంది, మీకు రాదా ఆ టెక్నాలజీ అని. ఏం చెప్తాం? నేను ఇప్పుడు అర్జెంటుగా కొత్త టెక్నాలజీ నేర్చుకొని మాంఛి జాబ్ కొట్టాలి. ఆది నామీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్.

మీకెవరికన్నా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయా? లేక ఈ బంపర్  ఆఫర్స్ అన్నీ నాకేనా?

10 Comments

  1. Thank you all…
    ilanti satires inka konni unnayi.
    time choosi post chesta 🙂

  2. Bagaa chepparu Mastarooo. ilantivi chalaa ekkuva villages lo.
    maree over expectations,vaati valla okkosaari sontha ooriki vellali antene alochinchalsi
    vasthondi. okasaari nenu engg chadive rojulalo, maa intlo TV remote pani cheyyaledu,
    appudu maa dad eraa nuvvu electronics e kadaaa idi repair chey ani. ha ha.
    final gaa adi vippi choose andulo manamu chesedi emee ledu. edo alaa anthaa clean chesi.
    new batteries vesaanu,tharuvaatha naa adrustam koddi remote pani chesindi,naa paruvu dakkindi
    (Venki pelli subbu chaavuku vachinaltu, mana valla expectations valla manaku problems :-)).

    chalaa mandiki SATHYAM, WIPRO, TCS le software companies,manamu Microsoft,Google,Cisco
    lanti companies lo job chesthunnamu ani cheppinaa kooda. emi Wipro lo raaledaa antaaru
    (appudu pakkada emunte adi theesukoni thala baadesukovaalanipisthundi) :-).

    ivanneee just samples ee.ilantivi maa oorki vellinappu edo okati thaguluthoone untundi.
    emi chestaanu alaane alavaatu padipoyaanu 🙂

  3. బాగుంది ::) ..ఆ బంపర్ ఆఫర్స్ మాకు తగిలాయ్ అండి .. కాకపోతే మీరు సెప్పుకున్నారు మేము సెప్పుకోలేదు అంతే

  4. చాలా బాగా రాసేరు.

    ఇండియా లో ఇలాంటి ఆఫర్ లు ఎక్కువ తగిలే అవకాశం ఉంది అనుకుంటా. ఇక్కడ కంప్యూటర్ పరిజ్ఞానం లేని చుట్టాలు తక్కువ, ఉన్న మిత్రులు అందరూ కొద్దో గొప్పో (పిన్నీసో, మేకో – మీ భాషలో) పొడిచే వాళ్ళే కావడం వల్ల వాళ్ళ పోట్లు ఏవో వాళ్ళే పొడుచుకుంటారు – మన వరకూ రావు.

    నేను స్కూల్ లో మాస్టర్స్ చేస్తున్నప్పుడు మాత్రం డయలప్ కనక్షన్ పని చెయ్యడం లేదు అని మా స్టూడెంట్ సెంటర్ లో పని చేసే తైవాన్ వాడు వల్ల ఇంటికి పిలిచి టీ అవీ ఇచ్చి మర్యాద చేసి మరీ అది ఫిక్స్ చేయించుకున్నాడు. దాని తరవాత మళ్ళీ అలా టాలెంట్ చూపించే అవకాశం రాలేదు.

  5. Well said!

    I couldn’t stop my laughter.

  6. Chala mandi expectations ilage vunnayi. “Well said”

  7. its 100 % true!!!!!

    Well Said!!!

  8. Nice satire Varun. I will extend your satire to many Hollywood flicks as well as popular TV drams on US Television.

    Examples:

    1. In Live Free or Die Hard http://www.imdb.com/title/tt0337978/, the geek character is a hacker. He just takes his hack-bag with him and hacks into any system he like, even the top secret pentagon servers. In this movie they show a traffic control system that is centrally controlled for the Washington DC area (the area and filed of study I am connected to as a part of my job) – the stuff they made up is hilarious, and comedy was not their intent. 🙂

    2. Two popular TV dramas I follow – NCIS and Criminal Minds have lead hacker characters.

    They keep type a lot of text to convince us that they are hacking or breaking encryption, when in fact the intuition tells us that (even if it can be done) it may very well be a mouse driven operation.

    • గురువు గారు, తెలుగు సినిమా కామెడీ ని హాలీవుడ్ సినిమాతో పోల్చి తిడుతున్నారో పొగుడుతున్నారో తెలీడం లేదు. బి. వి. పట్టాభిరామ్ గారు అన్నట్టు, సంసారం తల మాసిపోయేది ఈ expectations వల్లె అని.

      వరుణ్, మంచి వెటకారం పండించారు. 🙂

      -కనక

      • చెవిలో పూలేట్టడం మన వాళ్ళే కాదు, హాలీవుడ్ వాళ్ళు కూడా చేస్తారని చెబుతున్నా…

        expectations అంటే ఒక పాట గుర్తొచ్చింది
        పొరుగింటి కామాక్షమ్మను చూసారా, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా?