Pages Menu
Categories Menu

Posted by on Dec 8, 2011 in Literature, Telugu, TG Roundup

కవనాల తెలుగుజాతి

కవనాల తెలుగుజాతి

కన్యాశుల్కం తో ఊళ్లు తిరిగి వెతికి పట్టేవారు బంధుత్వాలు

ముక్కు మొఖాలే కాదు తాత ముత్తాతల చిరునామాలతో సహా…
పసిమొగ్గల్ని వడలిన  తోటకూరతో జత కడితే ….
సామజిక విలువలు వల్లకాటికి పోతున్నాయని గగ్గోలు ఎత్తారు కందుకూరి
సామాజిక విలువల్ని వల్లకాటి నుండి లాక్కువచ్చే ప్రయత్నం లో వచ్చాయి వర విక్రయాలు,
వరకట్నాల రూపంలో…..
ఏమి కోల్పోయాము? ఏమి కోల్పోతున్నాము?
కన్యాశుల్కం, వరకట్నం ఏది కావాలో ఏదీ కాక మరింకేదైనా కావాలో!
వెదుకులాట, పితకలాట
మరో కందుకూరి గగ్గోలెట్టినా, గొంతెత్తి అరచినా —
వినిపించని లోతుల్లో కూరుకుపోయి,
తాతముత్తాతలు సరే ,, ముక్కు మొఖాలు గుర్తు పట్టలేని అట్టడుగు పొరల్లో,
నాగరికత ముసుగులో కోల్పోయిన సామాజిక విలువలు ,
జీర్ణవ్యవస్థలో మానవతా విలువలు,
అపురూపమైన జ్ఞాపకంగా ఏమీ లేదు…
అన్నీ అతి సామాన్యమే, ఆర్భాటమే …….
భవితకు భావ్యమైన, భవ్యమైన వెలుగులు చూపాలంటే
కన్యాశుల్కం కాదు — వరకట్నం కాదు
కవనాల తెలుగుదనాన్ని నింపాలి…..
తెలుగు చరిత్రని, సంస్కృతిని వాడనియ్యకుండా, వీడిపోకుండా
భావి జీవితాలకు పదిలంగా అందిద్దాం.., ఆచరిద్దాం.
కవనాల తెలుగుజాతిని నిర్మిద్దాం.
–నాగమణి

3 Comments

  1. చాలా బావుందండి. కవనాల అంటే ఏంటో కాస్త చెబుతారా.

    • కవనాలు అంటే పావురాలు అండి.

  2. నాగమణి గారు. చాలా బాగుంది. ఏమీ అనుకోను అంటే చిన్న విమర్శ – “గగ్గోలు” బదులు మరో పదం వాడి ఉంటే నెగటివ్ అర్ధం రాకుండా ఉంటుందేమో అనుకున్నాను. మీ ఆవేదన మాత్రం చక్కగా కళ్ళకి కట్టారు. ఒక్కో రోజు గడిచేకొద్దీ తెలుగుదనం ఒక్కో మెట్టు కిందకి పోవడం చూస్తూ ఈ సంధి తరం లో ఉన్నందుకు మంచి రోజులని చూసినందుకు సంతోషించాలో, చెడ్డ రోజులని చూడబోతున్నామని విచారించాలో తెలియడం లేదు.