Pages Menu
Categories Menu

Posted by on Apr 3, 2011 in TG Roundup

వికృతి నామ సంవత్సర వికృతాలను నిరసిద్దాం, శ్రీ ఖర నామ సంవత్సరమును శ్రీకరం చేసుకుందాం

వికృతి నామ సంవత్సరం పేరుకు తగ్గట్టే ఈ ప్రపంచానికి ముఖ్యంగా తెలుగు వారికి కోలుకోలేని వికృతాలను చూపి కాలగర్భంలోకి జారుకోనుంది. ముళ్ళపూడి రమణ గారు మరియు నూతన్ ప్రసాద్ గారి మరణాలు, ఎటు చూసినా రాజకీయ అనిశ్చితి తో కూడిన సమీకరణలు, నలుదిక్కులా వ్యాపిస్తున్న విద్వేషాలతో అట్టుడుకుతున్న మన రాష్ట్రం.

ఇన్ని అనర్ధాలలో జరుగరాని అపరాధం కూడా జరిగింది, మన సంస్కృతి-సంప్రదాయాలకు ప్రతిరూపాలుగా ఎందరో కోట్ల మంది తెలుగువారు కొలిచే ట్యాంక్ బండ్ పై వెలసిన వైతాళికుల విగ్రహాల పైనే పడింది ఉన్మాదుల కన్ను. ప్రత్యక్షంగా తెలుగువారికి జరిగిన అవమానం ఇది. చూస్తూ వుండిపోవటం తప్ప ఏమీ చేయలేకపోయాం.

కానీ ఇకనైనా మేలుకుందాం

సుజాత గారు చెప్పినట్టు :

టాంక్ బండ్ మీది విగ్రహాలు కూలడం వల్ల వైతాళికులకేం నష్టం, అవమానం జరగలేదు. విగ్రహారాధన అలవాటు కావడం వల్ల మాత్రమే కాక వారి వ్యక్తిత్వాలని ఆరాధించిన వాళ్ళం కూడా అవడం చేత అసంఖ్యాక తెలుగు వారి హృదయాలు గాయపడ్డాయి.

ఈ బాధను కొద్దిగా ఉపశమింపజేసుకోడానికి సాటి తెలుగు వారు చేసిన పొరపాటుని క్షమించమని కోరడానికి అక్కడ …ఆ విగ్రహాలు కూలిన చోట కాసిన్ని పువ్వులు పెట్టి నివాళి ఘటిద్దామని ఒక చిన్న ఆలోచన.

నిజానికి ఈ ఆలోచన చేసింది మొట్టమొదటగా చావా కిరణ్ గారు.

ఏది ఏమైనా మన తరపున నివాళులు అర్పించటం తెలుగువారిగా మన కర్తవ్యం.

రేపు ఉగాది రోజు సాయంత్రం మేము కొందరం కలిసి పూవులను ఆ మహనీయుల విగ్రహాల శిథిలాల వద్ద చేర్చుదాం అనుకుంటున్నాం.

రేపే అని కాకుండా మీకు తోచిన సమయానికి అక్కడకు వెళ్ళి  నివాళులు అర్పించండి.

3 Comments

  1. what is the font used on this site? I have pothana and eenadu font but i still see only boxes for telugu pages

    • It is unicode – I think.

  2. వికృతి విలయాలను తట్టుకున్నారు బావుంది కానీ ఇది ఖర నామ వత్సరం ..అంటే గాడిదలకు[మూర్ఘులు/వితండవాదులు/మెదడులేని నాయకులకు]సుభాకాలం కనుకా దుష్టులకు దూరంగా ఉన్తెమంచిది మరి.