Pages Menu
Categories Menu

Posted by on Nov 6, 2012 in Podcasts, Specials, TG Roundup, USA

News And Views (Analysis on US Presidential Election)

ఇటు ఒబామా, అటు రామ్నీ …వీరిలో గెలుపెవరది ? అమెరికా సిటిజన్స్ లోనేకాదు, యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తున్న ఎన్నికలు రానేవచ్చాయి. ఈ నేప‌ధ్యంలో వార్తావిశ్లేషణ లైవ్ షోలో అమెరికా ఎన్నికలపై స్పెషల్ ఫోకస్. అమెరికాలో స్థిరపడిన ప్రొఫెసర్ మోహన్ వెనిగళ్ళ ఈ షోలో తాజా వివరాలను, విశ్లేషణ అందించారు.

అసలు రాజుగారింట్లో పెళ్లంటే ఊర్లో ఎందుకని అంత హడావుడిగా ఉంటుందని ఎవరైనా అంటే, `వీడెవడండి బాబూ…’ అంటూ ఎగాదిగా చూస్తాం. ఇదీ అంతే, అమెరికాలో ఎన్నికలంటే మనకేంటిలే అని ఊరుకోలేము. అందుకే యావత్ ప్రపంచం అగ్రరాజ్యంగా పేరుబడ్డ అమెరికాలో జరిగే ఎన్నికలను జాగ్రత్తగా గమనిస్తోంది. ఇటు ఒబామా, అటు రామ్నీ..మధ్యన శాండీ తుపాను. ఎవరి ప్రభావం వారిది. చివరకు ఎవరు విజేతగా నిలుస్తారు? అక్కడి ఓపీనియన్ పోల్స్ ఏమని చెబుతున్నాయి? అమెరికా ఎన్నికలకూ, మనదేశంలో జరిగే ఎన్నికలకూ ప్రధానంగా ఉండే పోలికలు ఏమిటీ, తేడాలేమిటీ…?? ఇలా ఎన్నో ప్రశ్నలకు తరంగ శ్రోతలకు చిరపరిచయమైన ప్రొఫెసర్ మోహన్ వెనిగళ్ళ ఈ షోలో వారి విశ్లేష‌ణ‌ను అందించారు.

Date of broadcast: Nov 6, 2012 (Just as the elections started)