ఇది మనలో ఎవరికో ఒకరికి జరిగే వుంటుంది. Enjoy those sweet and hot memories!
20 పైసలకి పుల్లైసు వచ్చే రోజులు అవి ….అ రోజు కూడా ఎప్పటిలాగే మా నాన్నజేబులో నుండి కొంచెం చిల్లర కొట్టేసి అవసరానికి తీసుకోని, ఒక పుల్లైసు , 50 గోలీలు కొనుక్కొని ….మా ఇంటి పక్కన ఉన్న పరమేష్ గాడికి ఊరించుకుంటూ ..వాడి ఇంటి ముందే తిరుగుతున్నాను ….
అది చూసి వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పుల్లైసు కోసం మారాం చేస్తే ….రెండు పీకింది …హమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా నేను మా వీధి లో జరిగే గోలీల పోటీకి ప్రాక్టీసు చెయ్యొచ్చు.
ఎవరికైన గోలీల ఆట లో గెలుస్తాను అనే నమ్మకం లేకపోతే ….నాతో ఆడేవాళ్ళు ….అదేంటో నేనంటే అంత అభిమానం అందరికి …..సాయంత్రం దాకా గోలీలు ఆడి ..నా ప్రత్యర్ధులకి నా గోలీలు అన్నీ సమానంగా పంచి ..కడుపులో ఆకలి రైలు స్టార్ట్ అయ్యే సరికి ఇల్లు గుర్తొచింది ….
మా నాన్న, నా కోసమే బెల్ట్ పట్టుకొని వరండాలో కూర్చున్నాడు… ఆది చాలదు అన్నట్లు పక్కింటి సీత (నా క్లాసు మేట్) గట్టిగా మా నాన్నకి వినపడే లాగా…. “రవీంద్రనాథ్ టాగోర్ గీతాంజలి రచించెను… రచించెను…” అన్ని తెలుగు పాఠం నా కోసమే చదువుతోంది. ఈ రెండు జడల సీతకి ఎవరైనా శ్రద్దాంజలి రచిస్తే బాగుండు అనిపించిది నాకు….
మా నాన్న నన్ను కొట్టరు ..కొట్టినా గట్టిగా కొట్టరు అన్న positive attitude తో లోపలి కి వెళ్ళాను ….టేప్ రికార్డర్ ఆన్ చేసారు మా నాన్న …పాటలు వినటానికి కాదు …నా అరుపులు బయటకి వినబడకుండా ఉండటానికి …..టేప్ రికార్డర్ ఇలా కూడా వాడొచ్చు అని నాకు ఆ రోజే తెలిసింది ….కొడితే కొట్టారు కాని , మంచి పాట పెట్టారు ….గ్యాంగ్ లీడర్ సినిమాలో “bajjovo bang bang”….గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి లాగా కాలర్ ఎగరేద్దాం అంటే ….మా నాన్న నా కాలర్ వదలటం లేదు ….
పాట అయిపోవచ్చింది…. మంచి పాట… రివైండు చేసి విందాం అని చెప్దాం అంటే, వినే position లో లేడు మా నాన్న.. ఆ లోపే రెండు జడల సీతా వచ్చింది…. మా నాన్న.. పాటనీ , మా చర్చలని pause లో పెట్టాడు…
“అంకుల్ , నేను మళ్లీ క్లాసు లో ఫస్ట్ వచ్చాను, స్వీట్స్ తీసుకోండి ” అంది సీత
మీకు progess card ఇచ్చారా సీతా… మావాడు చూపిచలేదు మరి…..
సీతా: ఎపుడో ఇచ్చారు అంకుల్… ఇచ్చి కూడా వారం రోజులు అయింది…
“ఏరా , progress card ఇచ్చారంట కదా , ఏం చేసావు రా ,చూపిచకుండా..” అన్నాడు మా నాన్న
“నిన్ననే ఆఖరి రోజు నాన్న గారు… ఇచ్చేసాను వాళ్ళ card మనకి ఎందుకు అని ..”
“మరి సంతకం రా?” ఆశ్చర్యంగా అడిగాడు మా నాన్న…
“ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా…. రోజంతా కష్టపడి వచ్చే మీకు ఎందుకు మళ్లీ శ్రమ అని నేనే పెట్టేసాను… అయినా మా టీచర్ చెప్పింది నాన్న గారు, మీ ఫ్యామిలీ లో ఎవరైన సంతకం పెట్టొచ్చు అని… నేనూ మీ ఫ్యామిలీయే కదా అని పెట్టాను… సంతకం పెట్టే ముందు అన్ని మార్కులు చెక్ చేశాను… total కరెక్టే వేసారు టీచర్ గారు….”
నా కోసం బెల్ట్ సరిపోదు అని లోపలి కి వెళ్లి ఏదో వెతుకుతున్నాడు మా నాన్న….
అయినా నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తే మేము ఎందుకు స్వీట్ తినాలి సీతా…..అసలు నీ పేరు సీతా కాదు “సూర్యకాంతం మళ్లీ పుటింది” అని పెట్టాలి …వెళ్ళు మీ అమ్మ పిల్లుస్తుంది నిన్ను …
సీతా: మా అమ్మ, నాన్న లేరు కదా ఇంట్లో… నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని మా చుట్టాలకి చెప్పడానికి 5 liters పెట్రోల్ కొట్టించుకొని స్కూటర్ మీద ఇపుడే ఊర్లోకి వెళ్లారు….
అవునా… అయినా 5th క్లాసు సెకండ్ unit test లో 1st ర్యాంక్ వస్తేనే ఇంత సినిమా చూపిస్తున్నారు. ఫైనల్ exam లో 1st రంక్ వస్తే…. మీ నాన్న వారోత్సవాలు చేస్తాడేమో…..
సీతా: మరి పిల్లకి encouragement ఇవ్వాలి కదా…..
నేను: తెలుగులో దానినే ఆస్థి అమ్ముకోవటం అన్ని కూడా అంటారులే ….. మీ నాన్న ఆస్థి నీ చేతిలోనే ఉంది సీతా… అలోచించుకో… నువ్వు ఇలాగే 10th దాక ఫస్ట్ ర్యాంక్ వస్తే మీ నాన్న loan తీసుకోవాలి మరి celebrations కి…
సీతా : అయ్యో …ఏంటి ఆ అచ్చు… చేతి మీద?
నేను : అదా… మూడు సింహాలు… మా నాన్న పోలీసు కదా… పోలీసు బెల్ట్ మీద ఉంటాయిలే
సీతా : మరి నాల్గవ సింహం ఏది….
నేను : నాల్గవ సింహమే కదా ఈ మూడు సింహాల అచ్చు గుదింది…
సీతా : అర్ధం కాలేదు ….
నేను : ఇది కూడా అర్ధం కాదు… మళ్లీ ఫస్ట్ ర్యాంక్ కదా నువ్వు…..
సీతా : అయినా మంచిగా చదువుకోవచ్చు కదా ….
నేను : సీతా… నువ్వు వద్దు అన్నా వచ్చావు…. స్వీట్ ఇచ్చావు… ఇష్టం లేకున్నా మైసూర్ పాక్ రెండు తిన్నాను… నవ్వు రాకపోయినా నవ్వుతున్నాను… ఈపాటికి నువ్వు వెళ్లిపోవాలి…. నువ్వు వెళ్ళిపోయాక… నీ దయవల్ల ఇంకో పాట వినాలి! ఇప్పుడు…. వెళ్ళు వెళ్ళు.. వెళ్ళూ………… వెళ్ళే ముందు ఇంకో మైసూర్ పాక్ ఇచ్చి వెళ్ళు …. నాకు కాదులే, మా అమ్మ కి!
సీతా : ఇందాక అంకుల్ కూడా ఆంటీకి అని తిసుకున్నారు రెండు ….
నేను : ఓహ్ అవునా…. మా నాన్న తీసుకుంది…. రేపు స్కూల్ లో ఇచ్చేస్తాను లే… ఇప్పుడు అయితే ఇచ్చే వెళ్ళు …. వెళ్లి 3rd unit test కి prepare అవ్వు…. ఈసారి ఈ స్వీట్ కాకుండా పాలకోవా తీసుకోని రావాలి…. సరేనా…
సరే అంటూ వెళ్ళిపోయింది సీతా…..
అమ్మ కి అని తీసుకున్న మైసూర్ పాక్ తిని, త్రేపుతూ వచ్చాడు మా నాన్న …..ఈసారి ఘరానా మొగుడు సినిమా లో “ఏందీ బే ఎట్లాగ ఉంది వొళ్ళు” పాట పెట్టాడు ….. ఇంక పాటలు వినే ఓపిక లేక …..
“నాన్న ఈసారి 3rd unit test లో ఫస్ట్ ర్యాంక్ వస్తాను ఆది కూడా చట్టబద్ధంగా — ఇదే నా ఛాలెంజి! ఛాలెంజి!! ఛాలెంజి!!!”
మా నాన్నకి డౌట్ వచ్చి, “ఏంటి రా ౩ సార్లు ఛాలెంజి అన్నావ్….ఏమైంది?”
ఛాలెంజి సినిమాలో చిరంజీవి అలానే చెప్తాడు లే …….. ఛాలెంజి గెలిచానో లేదో ఈసారి కలిసి నప్పుడు చెప్తాను ….ఎందుకు అంటే ప్రతి సీన్ climax లాగా ఉండాలి కదా ……
Related posts:
తనూజ గారు,
చాలా బాగా రాసారు…ఇది చదివి నవ్వు ఆపుకోలేక పోయాను ఆఫీసులో.. త్వరగా climax కూడా రాసేయండి ప్లీజ్
తనూజ గారు, చాలా చాలా బాగా వ్రాసారు. Hilarious!
Tanuja Garu,
chala baga varnincharu. naku maa daddy daggarinundi belt vathalu pada ledu kaani, sarigga mooredu pulla tho matram baaga vatalu paddai, adi oke okkasari. I tease him for that till now.
Kepp writing more
Brilliant write andi, Tanuja garu ! Hilarious !!
Tanuja Garu,
Really Nice and beautiful. I like this.
aaah! the belt experience. Unforgettable.
Tanuja garu,
Welcome. A great maiden post. Thanks.
intha violent ga vuntaya chinna naati gnapakalu?