23న ఫిల్మ్ ఇండస్ట్రీ మూతపడబోతున్నదా…అసలు ఇలా ఎందుకు జరగబోతోందీ…. ?
అసలు విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం లేవీసర్వీస్ టాక్స్ విధించాలనుకుంటోంది. ఇదే జరిగితే నిర్మాణ వ్యయం తడిసిమోపెడవుతుందని భయపడిపోతున్నారు నిర్మాతలు. దీంతో ఫిబ్రవరి
23 నుంచి చిత్రనిర్మాణం నిలిపివేస్తామంటోంది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అయితే, ఒక్కరోజే చిత్రపరిశ్రమ సమ్మెకు దిగుతుందా, లేక సమస్య పరిష్కారమయ్యేవరకు కొనసాగుతుందా అన్నది ప్రస్తుతానికి మనవద్ద ఇన్ ఫుట్స్ లేవు. కేంద్రప్రభుత్వం సర్వీస్ టాక్స్ పేరిట సుమారుగా
10.3 శాతంవరకు [...]
Ladies and gentlemen,
Well known print, radio and TV journalist and Nandi Award winner Sri Turlapati Nagabhushana Rao has joined Tharanga to conduct News and News Analysis shows on Tharanga-Telugu. For listening to state, national (India) and world news of interest to Telugu people across the globe, please tune to Tharanga-Telugu:
News: 8:00 — 8:30 AM (IST)
News [...]
రాజకీయ నాయకుల్లో చాలామంది అవినీతి పరులు. ఒకె, కాదనలేం. అధికార యంత్రాంగం అవినీతి పుట్ట. ఒకె…ఇదీ కాదనలేం. సమాజంలో లేదా ప్రభుత్వంలో ఫలానా వాళ్లు అవినీతి పరులంటా మీడియాలో ఊదరగొడ్తుంటారు. అయితే, ఇదే మీడియా ఓసారి తన ఒంటిమీద ఎంతటి అవినీతి మురికిని అంటించుకుందో పట్టించుకుంటున్నదా?
రాజకీయ నాయకులపై అవినీతిపరులన్న ముద్రవేసేటప్పుడు ఒక విషయం ఆలోచించాలి. రాజకీయ నాయకులు ఎక్కడి నుంచో ఊడిపడలేదు. వారు కూడా మన సమాజ వాస్తవ స్థితిగతులను అద్దం పడుతున్నారు. అంటే అవినీతి విషయంలో [...]
ఈ మధ్య ఒక ఎస్ఎంఎస్ బాగా స్ప్రెడ్ అవుతోంది.
అదేమిటంటే…
పాకిస్తాన్ లో సైనికదళ ప్రధానాధికారి ప్రభుత్వం ఎంతకాలం ఉండాలో నిర్ణయిస్తాడు, అదే ఇండియాలో ప్రభుత్వమే ఆర్మీ చీఫ్ పదవికాల వయసును నిర్ణయించేస్తుంటుంది.
భారత్ , పాకిస్తాన్ కు ఇంచుమించు ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చినా ప్రభుత్వ యంత్రాంగంలోనూ, సైనిక దళాధికారుల కదలికల్లోనూ చాలా తేడానే ఉంది. ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్న ఎస్ఎంఎస్ అందుకే అలా చురకవేసింది.
సైనికదళ ప్రధానాధికారి విజయ్ కుమార్ సింగ్ పదవీ [...]
మరోసారి బడ్జెట్ రాబోతుంది. ప్రస్తుతానికి బడ్జెట్ పూర్వసంప్రదింపులే జరుగుతున్నప్పటికీ, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే ఇప్పటి నుంచే సామాన్యుల్లో సైతం ఆసక్తి ఏర్పడుతోంది. నిజానికి ఉగాది నాడు పంచాంగ శ్రవణంలా మారిపోయింది పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం.అయినప్పటికీ ఎప్పటికప్పుడు రాబోయే బడ్జెట్ పై ఎన్నో ఆశలు, మరెన్నో ఊహలు.
ప్రస్తుతానికి మనదేశం గడ్డు సవాళ్లనే ఎదుర్కుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో సంతృప్తికరమైన బడ్జెట్ ను అందించడం ఆర్థికమంత్రికి కష్టమే. ప్రస్తుత పరిస్థితే ఇలా ఉంటే, ఇక రాబోయే కాలం [...]
మనరాష్ట్ర రాజధాని హైదరాబాద్ నిజంగానే భాగ్యనగరా… ఏమో…కొన్ని లెక్కలు చూస్తుంటే ఇది అభాగ్యనగరమేమో అనిపిస్తోంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
రెండువేల ఎనిమిది నుంచి హైదరాబాద్ లోనే ఆరువేల మంది పిల్లలు అదృశ్యమయ్యారు. ఇలా అదృశ్యమైనవారిలో కేవలం రెండువేలనూటతొమ్మిది మంది మాత్రమే తిరిగి ఇళ్లకు చేరారు. ఇలా మిస్సవుతున్న వారిలో ఎక్కువ మంది 12 నుంచి పదిహేను ఏళ్ల మధ్య ఉన్న బాలికలే కావడం ఆందోళన కలిగించే విషయం. రెండువేల ఎనిమిది , పదకొండు [...]
శాసన సభలో సమావేశాలు జరుగుతున్నప్పుడు మాత్రమే తరచూ దాని గురించి వార్తలు వస్తుంటాయి.
అయితే, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మొన్నటి శీతాకాల సమావేశాలు ముగిసినా అసెంబ్లీ చుట్టూనే
వార్తలు తిరుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, కీలకమైన రాజకీయ పరిణామాలకు అసెంబ్లీ కేంద్ర బిందువు
అవుతోంది.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ప్రస్తావిస్తాను. మన రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని కీలక అంశాలన్నింటినీ
ఏకకాలంలో ఉపయోగించుకుంటున్నది ఎక్కడో తెలుసా.. మన రాష్ట్రంలోనే. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కిందనే
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది. ఎమ్మెల్యేల [...]
అక్రమ ఆస్తుల కేసు ఎదుర్కుంటున్న కడప ఎంపీ జగన్ మోహన్ రెడ్డి త్వరలో అరెస్ట్ అవుతారనీ, అక్రమాల పుట్ట కదలిపోతుందనీ, ఆయనఅరెస్ట్ అవడం ఖాయమని రాజకీయ వర్గాల్లోనేకాకుండా ప్రజల్లో కూడా వదంతులు వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో జగన్ ఏం చేయబోతున్నారు ? భయపడిపోతున్నారా…? లేక ఎంతటి విపత్కర పరిస్థితులు తలెత్తినా ధైర్యంగా ఎదుర్కుని తనను తాను రక్షించుకుంటూనే తన పార్టీని సైతం బలోపేతం చేయబోతున్నారా…? అసలు ఆయన ఏ ధైర్యం చూసుకుని అంత గుండెనిబ్బరంగా ఉండగలుగుతున్నారు? ఆయన [...]
జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరం అవుతున్నారా?
బాబు, జూ.ఎన్టీఆర్ మధ్య అంతరం పెరిగిపోతున్నదా?
ఎన్టీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా?
2009 ఎన్నికల ప్రచారంలో మామయ్య చంద్రబాబుకు ఎంతో అండగా ఉన్న యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నెమ్మదిగా దూరమవుతున్నారా? బాబాయ్ బాలకృష్ణను, మామ చంద్రబాబును ఎంతో ఇష్టపడిన జూనియర్ ఎన్టీఆర్, ప్రచారఘట్టంలోనే ప్రయాణంలో తీవ్రగాయపడాల్సి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేన్ ఫెస్టోలో ఉన్న నగదు బదలీ పథకాన్ని ఆకాశానికి ఎత్తేశాడు జూనియర్ ఎన్టీఆర్. 2009 [...]
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుది మొదటి నుంచీ విచిత్రమైన స్టైలే. ఎవ్వరూ ఊహించని రీతిలో ప్రకటనలు ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. ఉన్నట్టుండి ఢిల్లీ నుంచి తెలంగాణ ఏర్పాటుపై తనకు అత్యంత రహస్యమైన సమాచారం అందిందని ఒకసారి, సోనియా ఏమనుకుంటున్నారో తనకు తెలిసిపోయిందని మరోసారి సంచలనాత్మక రీతిలో ప్రకటనలు గుప్పించారు. అంతేకాదు, తెలంగాణ ఉద్యమం చప్పబడినప్పుడల్లా మాటల తూటాలు పేల్చి అగ్గి రగలచ్చడంలో కూడా కేసీఆర్ కు సాటి మరెవరూ రారు. అలాగే, ఉన్నట్టుండి [...]
Continue reading …ఓట్లు రాగానే అటకెక్కించిన పథకాలు
ఏటుచూసినా ఎదిగీఎదగని బాల్యం
సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు
ప్రధాని నోటనే చేదునిజాలు
గడ్డుకాలాన్ని సూచిస్తున్న సర్వే
బక్కచిక్కిన బాల్యం ప్రభుత్వాలను కూలుస్తుందా? ఈమాట వినగానే మీరు ఉలిక్కిపడవచ్చు. అసందర్భంగా ఉన్నదంటూ కొట్టిపారేయవచ్చు. కానీ, పూర్తిగా చదివితే వాస్తవాలు మీకే అర్థమవుతాయి.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నుంచి కొన్ని చేదు నిజాలు బయటపడ్డాయి. ఏ సంక్షేమ పథకాలను చూపిస్తూ ఓట్లు దండుకుంటున్నారో, అవి పూర్తిగా డొల్ల అని తేలిపోయింది. చిన్నారుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఎలా ఆటలు ఆడుకుంటుందో అందరికి [...]
అధికారగణంలో అలసత్వం
ఫైల్ కదలాలంటే లంచం ఇవ్వక తప్పదు
ఐఏఎస్ ల్లోనూ కళంకితులు
వ్యాపారవేత్తలను చిరాకుపెడుతున్న బ్యూరోక్రసీ
మన అధికారగణం నిజస్వరూపమేమిటో ప్రపంచానికి మరోసారి తెలిసిపోయింది. ఆసియాలోనే మనదేశంలోని బ్యూరోక్రసీ అత్యంత అధ్వాన్నంగా ఉన్నదట. పూర్తగా తీసికట్టుగా ఉంటే పది మార్కులుగా నిర్దారించి చూస్తే, మనదేశ బ్యూరోక్రసీకి 9.21 పాయింట్లతో రేటింగ్ వచ్చింది. సింగపూర్ లోని ఓ ప్రతిష్ఠాత్మక కన్సల్టింగ్ సంస్థ ప్రపంచ దేశాల్లోని బ్యూరోక్రసీ పోకడలకు రేటింగ్ లు ఇచ్చింది.
ఒక్కమాటలో చెప్పాలంటే, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, చైనా కంటే మనదేశంలోనే బ్యూరోక్రసీ [...]
అరెస్ట్ అయినా ఎందుకు చలించలేదు?
జైల్లో ఈ ఆటలేంటీ, సీబీఐ ఎదుట ఆ మౌనం ఏమిటి?
జైల్లో అంత ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నారు?
సీబీఐ ఎదుట ఎందుకు పెదవి విప్పడంలేదు?
రావణ, శకుని, లాడిన్ లు కూడా స్థితప్రజ్ఞులేనా? విజయసాయి మైండ్ గేమ్ ఆడుతున్నారా?
జగన్ అక్రమాస్తుల కేసులో రెండో నిందితునిగా ఉన్న జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టాలాని సీబీఐ అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నా, ఆ ప్రయత్నాలేవీ ఫలించడంలేదు. ఇదే కేసులో అరెస్టయి ప్రస్తుతం చంచల్ గూడ [...]
Is Apple’s juggernaut going to slow down? I think so. Here is my take on Apple earnings and the company’s 1st miss since 2002.
Back in late 2003, one day as I was dropping my daughter at school I heard her say that she likes Apple’s cool new mp3 gadget, the iPod! (1st generation). I spent [...]
I don’t know who Brian Rogers is, but this is an excellent piece by him. Found it on Zero Hedge.
Submitted by Brian Rogers of Fator Securities
A Few Thoughts On The Occupy Wall Street Movement
“The machinery by which Wall Street separates the opportunity to speculate from the unwanted returns and burdens of ownership is ingenious, precise [...]
Recent Comments