`కమల’ గారడీ
అవినీతిపై బీజేపీ రెండు నాల్కుల ధోరణి అవినీతి కళంకితులకు టికెట్లు పార్లమెంట్ లో అవినీతి వ్యతిరేక ప్రసంగాలు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి మాటల్లో నిజాయితీ, చేతల్లో అవినీతి గారడీ వికసించిన కమలం అనగానే బీజేపీ గుర్తుకురాకమానదు. కమలం అనగానే స్వచ్ఛతకు, నిర్మలత్వానికీ ప్రతీకగా అనిపించకమానదు. ఎటువంటి బురద అంటకుండా అవినీతి ఊబిలో కూరుకుపోకుండా ప్రజలకు అండగా నిలిచేది తమ పార్టీనే అంటూ సీనియర్ నాయకుడు అద్వానీ , పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ వంటి వారు […]